క్రీడా పోటీలకు జట్ల ఎంపిక
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు బెంగళూరు లోని ఎస్–వైశ్యా యూనివర్సిటీ ఆవరణలో జరుగనున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ యోగాసన (మహిళల) చాంపియన్ షిప్‌లో తమ యూనివర్సిటీ నుంచి ప్రాతి నిధ్యం వహించే క్రీడాకారుల ఎంపిక ప్రక్రియను శుక్రవారం పూర్తి చేశామని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఇ.త్రిమూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన కాకానిలోని ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాలకు చెందిన కె.హరిణి, టి.హేమకావ్య, కె.అంజని, కె.రక్షిత, విజయవాడ ప్రభుత్వ డెంటల్ కళాశాలకు చెందిన ఎం.వర్షిత, ఏలూరులోని ఆశ్రమ్ మెడికల్ కళాశాలకు చెందిన ఎం. జ్యోతి కాళీప్రియా, టి.చందనతో పాటుగా విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ జె.రామును జట్టు మేనేజర్ గా ఎంపిక చేశామని తెలియజేశారు.
సౌత్‌జోన్ బ్యాడ్మింటన్
టోర్నమెంట్‌కు ఎంపిక
నేటి నుంచి ఈనెల 6 వరకు కేఎల్‌యూడీమ్డ్ వర్సిటీ లో జరుగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ (పురుషుల) టోర్నమెంట్‌లో తమ యూనివర్సిటీ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు క్రీడాకారులను ఎంపిక చేశామని త్రిమూర్తి తెలియజేశారు. రాజమండ్రిలోని జీఎస్‌ఎల్ మెడికల్ కళా శాలకు చెందిన పి.రవితేజ, ఏలూరు ఆశ్రమ్ మెడికల్ కళాశాలకు చెందిన దర్ష జైన్, చిత్తూరు జిల్లా కుప్పంలోని పీఈఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్‌కు చెందిన వి.కీర్తి వేషన్, విశాఖపట్నంలోని అనిల్ నిరుకొండ కాలేజ్ ఆఫ్ ఎంఎల్‌టీకు చెందిన ఎస్. నాయుడు, నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలకు చెందిన ఎం.గురుసాగర్ రెడ్డి, గుడివాడలోని డాక్టర్ గురురాజు ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాలకు చెందిన జోసఫ్ ఆనంద్, నెల్లూరులోని నారాయణ మెడికల్ కళాశాలకు చెందిన పి.సూర్యప్రకాష్, జట్టు మేనేజర్‌గా అమలాపురంలోని కోనసీమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఫిజికల్ డైరెక్టర్ కె.నాగరాజును ఎంపిక చేశామని తెలియజేశారు. జట్టులో ఎంపికై న క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ సౌరబ్‌గౌర్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికారెడ్డి అభినందించారు.
సౌత్‌జోన్ షటిల్ పోటీలకు సిద్ధార్థ జట్టు ఎంపిక
పెనమలూరు: సౌత్‌జోన్‌న్ ఇంటర్ యూని వర్సిటీ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ జట్టును ఎంపిక చేశామని వర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ పి.రఘు తెలిపారు. ఆయన శుక్రవారం వివరాలు తెలుపుతూ సౌత్‌జోన్‌్ ఇంటర్ యూనివర్సిటీ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ఈ నెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కేఎల్ యూనివర్సిటీలో జరగనున్నాయన్నారు. ఈ పోటీలో పాల్గొనే జట్టుకు ఎండీ షోయబ్, సాయి పునీత్, టి.మనోజ్, పి.సోహిత్, టి.గణేష్‌లను ఎంపిక చేశా మన్నారు. ఈ సందర్భంగా జట్టుకు ఉప కులపతి డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, ప్రో ఉపకులపతి డాక్టర్ ఏవీ రత్నప్రసాద్ అభినందనలు తెలిపారు.
ఎంపికై న క్రీడాకారులతో సౌరబ్ గౌర్, యూనివర్సిటీ ప్రతినిధులు; సిద్ధార్థ షటిల్ జట్టుతో వీసీ వెంకటేశ్వరరావు, ప్రో వీసీ రత్నప్రసాద్
క్రీడా పోటీలకు జట్ల ఎంపిక


