వైఎస్సార్ సీపీలోకి జనసేన నుంచి చేరిక
తిరువూరు: గంపలగూడెం మండలం ఆర్లపాడు గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తలు గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. జనసేన నాయకులు కొంకి హరికృష్ణ, కొంకి గౌతమ్, మల్లివెల్లి రవీంద్ర, మల్లివెల్లి గోపాలకృష్ణల నాయకత్వంలో పలువురు కార్యకర్తలు తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు సమక్షంలో పార్టీలో చేరారు. వారికి స్వామిదాసు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆర్లపాడు పార్టీ అధ్యక్షుడు తల్లపురెడ్డి కృష్ణారెడ్డి, స్థానిక నాయకులు కూరాకుల ప్రసాద్, రామ కృష్ణ, గడ్డం మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


