మెడికల్ యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ
లబ్బీపేట(విజయవాడతూర్పు):రపభుత్వ గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన క్యాలెండర్ గురువారం కలెక్టర్ జి.లక్ష్మీశా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య ఉద్యోగులు ప్రజారోగ్య పరిరక్షణలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలు ప్రశంసనీయమని తెలిపారు. నూతన సంవత్సరంలో కూడా ఉద్యోగులు మరింత నిబద్ధతతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం యూనియన్ నాయకులు నూతన క్యాలెండర్‌ను ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావుకు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నవరపు వేంకటేశ్వరరావుకు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసినికి అందచేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై. శ్రీనివాసరావు, పి.నాగరాజు, సిటీ బ్రాంచ్ అధ్యక్షురాలు పి.సౌభాగ్యం, కోశాధికారి జి. పుణ్యకుమారి, యూనియన్ జిల్లా, సీటీ నాయకులు పాల్గొన్నారు.


