పేకాట శిబిరంపై దాడి
రూ.2,20,780 నగదు స్వాధీనం
కోడూరు:స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని యర్రారెడ్డిపాలెంలో బుధవారం రాత్రి జరిగిన పేకాట దాడిలో ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ చాణక్య తెలిపారు. పేకాటరాయుళ్ల నుంచి రూ.2,20,780 నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు):ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీస్‌కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు లాం అండ్ ఆర్డర్, క్రైమ్, ట్రాఫీక్, సైబర్ క్రైమ్, అడ్మినిస్ట్రేషన్ ఇలా విబాగాల వారీగా డీసీపీలు, ఇతర అధికారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు సీపీకి పుష్పగుచ్ఛం అందచేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సీపీని కలిసిన వారిలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కేజీవీ సరిత, ఏబీటీఎస్ ఉదయరాణి, తిరుమలేశ్వర రెడ్డి, షిరీన్‌బేగం, కృష్ణప్రసన్న, యస్‌విడి ప్రసాద్, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.
పేకాట శిబిరంపై దాడి
పేకాట శిబిరంపై దాడి


