రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలు
చల్లపల్లి:మద్యం తాగిన ఇద్దరు యువకులు దిచక్ర వాహనంపై వేగంగా వెళుతూ రోడ్డు ప్రమాదానికిగురై తీవ్ర గాయాలపాలైన ఘటన నడకుదురు రోడ్డులోని మేకారవారిపాలెం వద్ద గురువారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని పురిటిగడ్డకు చెందిన గంజి నాని, కనపర్తి కళ్యాణ్‌లు సాయంత్రంగం ఐదు సమయంలో మద్యం తాగి ద్విచక్ర వాహనంపై చల్లపల్లి నుంచి పురిటిగడ్డకు బయలుదేరారు. మద్యం తాగి ఉండటం దానికితోడు వేగంగా వెళుతుండటంతో మేకావారిపాలెం అడ్డరోడ్డు దాటగానే రోడ్డుపై పడిపోయి బండితోపాటు కొంతదూరం జారుకుంటూ పోయారు. గంజి నాని తలకు, ముఖంపై బలమైన నేలదెబ్బలు తగలటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఇంతలోనే చెవిలో నుంచి రక్తం కారటం, యూరిన్‌కు వెళ్ళటంతో రోడ్డునపోయే వారు అగి కోమాలోకి వెళ్లకుండా నానికి పరిచర్యలు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. రెండవ వ్యక్తి కనపర్తి కళ్యాణ్‌కు గాయాలతోపాటు కాలు విరిగింది. కొంతసేపటి తరువాత పురిటిగడ్డ గ్రామానికి కొందరు అక్కడి చేరుకుని కళ్యాణ్‌ను ద్విచక్ర వాహనంపై చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. సమాచారం అందుకున్న చల్లపల్లి 108 సిబ్బంది ఈఎంటి రవీంద్ర, పైలెట్ షఫీలు గంజి నానిని కూడా చల్లపల్లి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఇద్దరీని మచిలీపట్నంలోని జిల్లా ప్రభత్వ ఆసుపత్రికి తరలించారు. నాని తలకు బలమైన దెబ్బ తగలటంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై బయులుదేరిన నాని, కళ్యాణ్ మార్గమద్యంలో ఎదురుగా వచ్చే పలు ద్విచక్ర వాహనాల మీదకు కూడా దగ్గరవరకూ దూసుకొచ్చి త్రుటిలో తప్పించి పక్కనుంచి వెళ్లిపోయారని పలువురు ద్విచక్ర వాహనదారులు చెబుతున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలు


