భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ క్లినిక్‌లు
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్‌లు ఎంతగానో దోహదం చేస్తాయని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్‌లో ఆయన రెవెన్యూ క్లినిక్‌ను సోమవారం ప్రారంభించి వాటి పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రెవెన్యూ క్లినిక్‌లో ఐదు కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. దరఖాస్తుల పరిశీలన, సలహాలు, సూచనల విభాగం, 22ఏ సమస్యలు, భూసేకరణ సంబంధిత సమస్యలు, ఆర్వోఆర్, పట్టాదారు పాస్‌పుస్తకాలు, సుమోటో, అడంగల్ కరెక్షన్ సమస్యలు, రీ–సర్వే, విస్తీర్ణం తేడా, జాయింట్ ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్‌పీఎం) తదితర సమస్యలకు సంబంధించిన విభాగాలు ఉన్నాయన్నారు. జిల్లాలో ఎక్కువగా భూ సంబంధిత సమస్యలు ఉంటున్నాయని వాటన్నింటికీ ఈ రెవెన్యూ క్లినిక్ ద్వారా చక్కటి పరిష్కారం లభించనుందని చెప్పారు. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకుని భూసంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, డీఆర్వో చంద్రశేఖరరావు, కెఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, డెప్యూటీ కలెక్టర్ పోతురాజు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


