వనజా చంద్రశేఖర్‌కు నృత్య తపస్వి పురస్కారం
గన్నవరంరూరల్: విజయలలిత కూచిపూడి నృత్య అకాడమీ(గన్నవరం) నాట్య గురువు వనజా చంద్రశేఖర్ ప్రతిష్టాత్మక నృత్య తపస్వి పురస్కారం అందుకున్నారు. శుక్రవారం రాత్రి ఏలూరు అభినయ నృత్య భారతి 30వ వార్షికోత్సవంలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ప్రఖ్యాత నాట్యాచారుడు కోరాడ నరసింహారావు స్మారక–2025 అవార్డు నృత్య తపస్విని ఆమెకు అందించారు. కానాల గురుమూర్తి కళావేదికపై ముఖ్య అతిథులు ఆలపాటి నాగేశ్వరరావు, బి.వి.రమణమూర్తి, డాక్టర్ ఎం.ఎస్.చౌదరి, కమ్ములు ఆదినారాయణ, పిలగల కొండలరావు, చిర్లపల్లి రామ్మోహనరావు, డాక్టర్ కె.కృష్ణ చైతన్య స్వామి, కె.వి.సత్యనారాయణ పాల్గొని వనజా చంద్రశేఖర్ సేవలను ప్రశంసించారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి గన్నవరానికి చెందిన భక్తులు రూ.1.23 లక్షల విరాళం సమర్పించారు. చిట్టి శ్రీరామమూర్తి శనివారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి ఉమామహేశ్వరి పేరిట రూ.1,23,456 విరాళం అందజేశారు. అనంతరం దాతకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు.
కంకిపాడు: విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని ఉయ్యూరు డీవైఈఓ పద్మారాణి స్పష్టంచేశారు. ఈడుపుగల్లు నారాయణ విద్యాసంస్థల పాఠశాలలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘటనపై శనివారం శాఖాపరమైన విచారణ సాగించారు. విద్యార్థులపై పాఠశాల హాస్టల్ వార్డెన్ లైంగిక వేధింపులకు పాల్పడటం, అనుచితంగా వ్యవహరించటంపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో తల్లిదండ్రులు వార్డెన్, ఏఓలకు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై డీవైఈఓ పద్మారాణి విచారణ సాగించారు. ప్రిన్సిపాల్ తిరుమలరావు, విద్యార్థులతో వేర్వేరుగా మాట్లా డారు. వార్డెన్‌తోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఓలను విధుల నుంచి తొలగించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. విచారణలో ఎంఈఓ –1 వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కానూరు సిద్ధార్థ డీమ్డ్ టూ బీ యూనివర్సిటీ ఆవరణలోని వైవీ రావు సిద్ధార్థ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శుక్రవారం ప్రారంభమైన జేఎన్టీయూ అంతర్ కళాశాలల సెంట్రల్ జోన్ షటిల్ బ్యాడ్మింటన్ (పురుషులు, మహిళలు) టోర్నీ శనివారం ముగిసింది. జేఎన్టీయూ పరిధిలోని అనుబంధ కళాశాల నుంచి 22 పురుషుల, 11 మహిళల జట్లు ఈ పోటీల్లో తలపడ్డాయి. పురుషుల విభాగంలో అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గుడ్లవల్లేరులోని ఎస్ఆర్ గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ, కానూరు సిద్ధార్థ కాలేజ్లీ, మహిళల విభాగంలో భీమవరంలోని ఎస్ఆర్కే ఇంజినీరింగ్ కాలేజీ, నరసరావుపేటలోని నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజీ, నర్సాపూర్‌లోని స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ జట్లు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. సిద్ధార్థ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ పి.వెంకటేశ్వరరావు, ప్రో వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎ.వి.రత్నప్రసాద్, రిజిస్ట్రార్ ఎం.రవిచంద్, జేఎన్టీయూ కాకినాడ స్పోర్ట్స్ సెక్రటరీ ప్రొఫెసర్ జి.శ్యామ్‌కుమార్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు.
వనజా చంద్రశేఖర్‌కు నృత్య తపస్వి పురస్కారం
వనజా చంద్రశేఖర్‌కు నృత్య తపస్వి పురస్కారం
వనజా చంద్రశేఖర్‌కు నృత్య తపస్వి పురస్కారం


