ఉత్కంఠగా సాగిన సెమీ ఫైనల్ పోటీలు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని చెన్నుపాటి రామకోటయ్య మునిసిపల్ కార్పొరేషన్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీలు రసవత్తరంగా జరుగుతున్నాయి. శనివారం జరిగిన సెమీ ఫైనల్స్ పోటీలు ఉత్కంఠగా సాగాయి. ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తమిరి సూర్య చరిష్మ 21–18, 18–21, 21–9 స్కోర్‌తో తెలంగాణకు చెందిన రక్షితశ్రీపై విజయం సాధించింది. ఉమెన్స్ సింగిల్స్, ఉమెన్స్ డబుల్స్, మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగాల్లో సెమీ ఫైనల్స్ పోటీలు జరిగాయి. ఆదివారం ఫైనల్స్ బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతాయి. అనంతరం జరిగే ముగింపు సభలో విజేతలకు బహుమతులను అందజేస్తారు. సెమీ ఫైనల్స్ పోటీలను సుప్రీం కోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి సంజయ్ మిశ్రా తిలకించారు.
ఉత్కంఠగా సాగిన సెమీ ఫైనల్ పోటీలు
ఉత్కంఠగా సాగిన సెమీ ఫైనల్ పోటీలు


