న్యూస్‌రీల్
ఆయుర్వేద ఆస్పత్రి తనిఖీ
కల్యాణోత్సవాలు ప్రారంభం
బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్ శ్రీ 2025
u8లో
ముందుకు సాగని వెస్ట్ బైపాస్ పనులు
● చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర
గడిచినా పరిష్కారం కాని సమస్య
● గత ప్రభుత్వ హయాంలోనే
96శాతం మేర పనులు పూర్తి
● నున్న వద్ద కొలిక్కి రాని
విద్యుత్తు టవర్ల సమస్య
● ఈనెల 20నుంచి హైదరాబాద్
ట్రాఫిక్ బైపాస్ రోడ్డులోకి మళ్లింపు
● వచ్చే ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి
అవుతాయంటున్న అధికారులు
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 3600 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా దిగువకు 2000 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 43.0610 టీఎంసీలు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వెస్ట్ బైపాస్‌కు చిక్కు ముడి వీడటం లేదు. దాదాపు 96శాతం పనులు గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయినా.. విద్యుత్ టవర్ల సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
ప్యాకేజీ–3 కింద చిన అవుటుపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల మేర బైపాస్ రోడ్డు నిర్మించాలని ప్రణాళిక చేశారు. ఈ పని విలువ రూ.1,148కోట్లు కాగా, పనులను మెగా సంస్థ ఫిబ్రవరి 2021లో చేపట్టింది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పనులపై ప్రత్యేక దృష్టి సారించడంతో పనులు శరవేగంగా ముందుకు సాగాయి. ఈ రహదారి కోసం 14 గ్రామాల్లో 188.92 హెక్టార్ల భూసేకరణ చేశారు. ఇందుకోసం రూ.416 కోట్లు ఖర్చు చేశారు. విజయ వాడ వాసులకు ట్రాఫిక్ కష్టాలు చెక్ పెట్టాలనే కృత నిశ్చయంతో పనులను పరుగు పెట్టించారు. జనవరి 2024కు బైపాస్ అందుబాటులోనికి తెచ్చే విధంగా 96శాతం మేర పనులను పూర్తి చేశారు. కొంత మంది రైతులు కోర్టుకు వెళ్లి విద్యుత్తు టవర్ల మార్పిడి ప్రాంతంలో పనులు పూర్తి కాకుండా అడ్డుకొన్నారు. మూడు చోట్ల పనులు ఆగిపోయాయి. 90మీటర్ల మేర జక్కంపూడి, నున్న ప్రాంతంలో విద్యుత్తు టవర్లు ఉన్న ప్రాంతంలో రోడ్డు పనులు ఆగిపోయాయి. ఆ సమస్య చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచినా కొలిక్కి రాలేదు.
ఈనెల 20వ తేదీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలను వెస్ట్ బైపాస్ రోడ్డులో అనుమతించారు. పనులన్నీ పూర్తి అయ్యాక పశ్చిమ బైపాస్ మొదలయ్యే చిన్న అవుటుపల్లి దగ్గర, ఎన్‌హెచ్–16 అనుసంధాన పనులు పూర్తి కాలేదు. ఇంకా నున్న దగ్గర విద్యుత్తు టవర్ల సమస్య అలాగే ఉంది. ఈ నేపథ్యంలో పనులు వచ్చే ఏడాది పిభ్రవరి నాటికి గాని పనులు పూర్తి కావని అధికారులు పేర్కొంటున్నారు.
ప్యాకేజీ –4 గొల్లపూడి నుంచి కాజ వరకు పనులు 88 శాతం మేర మాత్రమే పూర్తయ్యాయి. పలు చోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ పనులు దాదాపు నాలుగు, ఐదు నెలలు పడుతుందనే భావన వ్యక్తం అవుతోంది. ఈ పనులు పూర్తి అయితే కాని చైన్నె వైపు వెళ్లే వాహనాలను బైపాస్‌కు మళ్లించే అవకాశం లేదు.
7
హనుమాన్‌జంక్షన్ రూరల్: బాపులపాడు మండలం కానుమోలులోని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిని ఆయుష్ డైరెక్టర్ కె. దినేష్ కుమార్ మంగళవారం తనిఖీ చేశారు.
మోపిదేవిలోని శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో స్వామి షష్ఠి కల్యాణ మహోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.
జక్కంపూడికి సంబంధించి ఉన్న లైన్లనే ఎత్తు పెంచే విధంగా రైతులతో ఒప్పందం కుదరటంతో అక్కడ సమస్య ప్రస్తుతం పరిష్కారం అయ్యింది. దీంతో అక్కడ విద్యుత్తు టవర్ల ఎత్తు పెంచే పనులు సాగుతున్నాయి. అయితే నున్న వద్ద విద్యుత్తు టవర్లకు సంబంధించిన సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. కోర్టులో ఈ వివాదం నడుస్తోంది. రైతులు అక్కడ విద్యుత్తు టవర్ల ఎత్తు పెంచాలని కోరుతున్నారు. అయితే ఆ ప్రాంతంలో 5 విద్యుత్తు టవర్ల మార్పిడికి సంబంధించి 75 శాతం పనులు పూర్తి అయ్యాయి. దీంతో విద్యుత్తు టవర్ల ఎత్తు పెంచితే అక్కడ ఇప్పుడు నిర్మించిన టవర్లకు సంబంధించిన వ్యయం వృథా అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు రోడ్డులో కొన్ని చోట్ల మట్టిని సక్రమంగా రోలింగ్ చేయకపోవడంతో సమస్య తలెత్తింది. రోడ్డు బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు వద్ద కుంగినట్లు అధికారులు గుర్తించి, మరమ్మతు పనులు చేపట్టారు. రోడ్డు నిర్వహణ 15 ఏళ్ల పాటు కాంట్రాక్టు సంస్థదే కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా


