సిఫార్సులకే ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

సిఫార్సులకే ప్రాధాన్యం

Nov 26 2025 6:59 AM | Updated on Nov 26 2025 6:59 AM

సిఫార

సిఫార్సులకే ప్రాధాన్యం

సిఫార్సులకే ప్రాధాన్యం కంకిపాడు: కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో 1.54 లక్షల హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. ఎంటీయూ, బీపీటీ ఇతర స్థానిక రకాలను రైతులు సాగుకు ఎంపిక చేసుకున్నారు. ఈ సీజన్‌లో రైతులు అడుగడుగునా కష్టాలను ఎదుర్కొన్నారు. సాగు మొదట్లో విత్తనాలు కోసం, నారుమడులు సిద్ధమవుతున్న దశలో సాగునీటి కోసం తిప్పలు పడ్డారు. పైరు ఎదుగుదల సమయంలో యూరియా కొరతతో నానా అవస్థలు ఎదుర్కొన్నారు. ఆఖరికి బ్లాక్‌ మార్కెట్‌లో ఎరువులు కొనుగోలు చేసి పంటను సంరక్షించుకున్న పరిస్థితులు. పంట చిరుపొట్ట, కంకులు గట్టి పడే దశలో మోంథా తుపాను రూపంలో ప్రకృతి విరుచుకుపడింది. చేతికొచ్చిన పంట నేలవాలింది. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక అంచనాల ప్రకారం 40వేల హెక్టార్లలో పంట నేలపడి రైతులు నష్టపోయారు. నీట మునిగిన పంటను సంరక్షించుకోవటానికి రైతులు పడరాని పాట్లు పడ్డారు. పొలాల్లో మురుగు పక్కనే ఉన్న బోదెల్లోకి మళ్లించి పంటను కోత కోయించి మిల్లులకు తరలిస్తున్నారు. ఈ తరుణంలో పచ్చనేతల పెత్తనం పెరిగిపోయింది. రైతు సేవా కేంద్రాల సిబ్బంది కొందరు అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్నారు. సొసైటీ అధ్యక్షులు, స్థానిక పచ్చనేతల సిఫారసులకు అనుగుణంగానే ధాన్యం సేకరణ చేపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధాన్యం కొనుగోలు చేయాలని రైతు సేవా కేంద్రాలకు వెళ్లిన రైతులకు అక్కడ సిబ్బంది నేతలతో ఒక మాట చెప్పించాలంటూ చేస్తున్న సూచనలకు అన్నదాతలు విస్తుపోతున్నారు. నేతలు చెప్పిన వాళ్ల ధాన్యం ముందుగా మిల్లులకు తరలిపోతుంది. అంతే తప్ప వరి కోతల సీరియల్‌ ఆధారంగా షెడ్యూలు ప్రకారం ధాన్యం సేకరణ ప్రక్రియ జరగటం లేదు. నేతల పెత్తనం పెరిగిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు.

గత ప్రభుత్వంలో పూర్తి పారదర్శకంగా..

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో దళారులు, నేతల పెత్తనాలకు ఆస్కారం లేకుండా రైతుల నుంచి నేరుగా ధాన్యం సేకరణ సాగింది. రైతు ఖాతాలకు నేరుగా డబ్బులు జమ అయ్యేలా తీసుకున్న చర్యలకు సర్వత్రా ప్రశంసలు వినిపించాయి. కానీ ఈ దఫా మాత్రం నేతల పెత్తనం పెరిగిపోవటంతో రైతు లు ఇబ్బందులు పడుతున్నారు. సిఫారసులు ఉన్న రైతుల ధాన్యం వెంటనే మిల్లులకు తరలిపోతుంది. కానీ సామాన్య రైతుల ధాన్యం రోడ్ల మీదే నిలిచిపోతుంది. సిఫార్సులతో సంబంధం లేకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ధాన్యం సేకరణ ప్రక్రియపై పచ్చనేతల పెత్తనం

వారి అనుమతి

ఉంటేనే కొనుగోళ్లు

లేకుంటే ఎక్కడి ధాన్యం అక్కడే

చోద్యం చూస్తున్న అధికారులు

ఆందోళన చెందుతున్న

అన్నదాతలు

పచ్చనేతల పెత్తనం..

పెనమలూరు నియోజకవర్గంలోని కౌలురైతు హరి వరి పంట కోత కోయించి ధాన్యం బస్తాలు మిల్లుకు తరలించేందుకు సిద్ధం చేశాడు. రైతు సేవా కేంద్రం సిబ్బందిని ధాన్యం సేకరణ విషయమై సంప్రదిస్తే ముందుగా సొసైటీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వాలని, ఆయన తీసుకోమంటే వెంటనే తీసుకుంటామంటూ సమాధానం ఇచ్చారు. దీంతో ఆ కౌలురైతు సొసైటీ అధ్యక్షుడి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. మూడు రోజులుగా కాటా వేసిన ధాన్యం బస్తాలు ఆరుబయటే పడి ఉన్నాయి. కృష్ణా జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రైతు ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునే విషయంలోనూ పచ్చనేతల పెత్తనమే చెలామణి అవుతోంది. నేతల సిఫార్సుతో ముడి పెట్టడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.

సిఫార్సులకే ప్రాధాన్యం1
1/1

సిఫార్సులకే ప్రాధాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement