లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంతో పాటు, పలు ప్రాంతాల్లో చోరీకి గురైన 600 సెల్‌ఫోన్లను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు రికవరీ చేశారు. వాటి విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు తెలిపారు. విజయవాడ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మంగళవారం రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు సీపీ అందజేశారు. ఆయన మాట్లాడుతూ దొంగిలించిన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్‌తో రికవరీ చేసినట్లు తెలిపారు.
వేర్వేరు ప్రాంతాలకు చెందినవి..
రికవరీ చేసిన మొబైల్స్‌లో ఏపీకి చెందిన 504, ఒడిశావి 20్ల, కర్ణాటక 18, మహారాష్ట్రకు చెందిన 16, రాజస్తాన్ 13, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 12 ఫోన్లు, బిహార్ 10, వెస్ట్ బెంగాల్ 7 మొబైల్స్ రికవరీ చేశామని తెలిపారు. అలాగే ‘సురక్ష’ ద్వారా ఆరువేల సీసీ కెమెరాలు ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలని చెప్పారు.