
నేడు నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లా వ్యాప్తంగా మంగళవారం నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని సోమవారం తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులు 5.26 లక్షల మందికి ఆల్‌బెండజోల్ మాత్రలు మింగించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు. నులి పురుగులు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నారు. ఏటా ఫిబ్రవరి, ఆగస్టు నెలల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. పిల్లల్లో నులిపురుగులు నిర్మూలించి రక్తహీనత నివారణ, శారీరక. మానసిక ఎదుగుదలకు పోషకాహారలోం, పిల్లల్లో అలసట, బలహీనత వంటి సమస్యలను నిర్మూలించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా డాక్టర్ సుహాసిని తెలిపారు. అందులో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో డీ వార్మింగ్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. పిల్లల ఆరోగ్య సంరక్షణకు ప్రతి ఒక్క చిన్నారికి ఈ మాత్రలు వేయాలని సూచించారు.
మాత్రల పంపిణీ ఇలా..
ఎన్టీఆర్ జిల్లాలో 192 కళాశాలలు, 1,446 పాఠశాలలు, 1,475 అంగన్‌వాడీ కేంద్రాల్లో 19 ఏళ్లలోపు గల 5,26,323 మంది చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించనున్నట్లు తెలిపారు. అందుకోసం 5.64 లక్షల మాత్రలను సిద్ధం చేశామన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో 5.64 లక్షల మాత్రలు సిద్ధం