● ఉప్పొంగిన అభిమానం
ఉత్సాహం ఉరకలెత్తింది.. అభిమానం తరంగం తరలివచ్చింది. తమ అభిమాన నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు వేలాదిగా ప్రజలు కదిలివచ్చారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో బుధవారం గురునానక్‌కాలనీలోని ఎన్‌ఏసీ కల్యాణ మండపంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. తమ అభిమాన నేతతో కలిసి ప్రార్థనలు, ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు ముస్లింలు వేలాదిగా తరలివచ్చారు. కల్యాణమండపం సమీపంలోని రోడ్లు అభిమానులతో కిక్కిరిశాయి. జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్ వస్తుండగా జై జగన్ అన్న నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.
– లబ్బీపేట(విజయవాడతూర్పు)
● ఉప్పొంగిన అభిమానం


