రేపు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో 17వ జాతీయ కాన్ఫరెన్స్‌ | Sakshi
Sakshi News home page

రేపు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌లో 17వ జాతీయ కాన్ఫరెన్స్‌

Published Tue, Nov 28 2023 1:44 AM

-

ఉంగుటూరు: మండలంలోని ఆత్కూరు స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ ఆడిటోరియంలో ఈ నెల 29, 30 తేదీల్లో శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వ విద్యాలయం, జాతీయ మహిళా పశువైద్యుల సంఘం ఆధ్వర్యంలో గన్నవరం ఎన్టీఆర్‌ పశువైద్య కళాశాల నేతృత్వంలో 17వ జాతీయ కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహణ కార్యదర్శి బి.సుబ్రహ్మణ్యేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి రోజు పద్మశ్రీ డాక్టర్‌ సోసమ్మ, గోపాలకృష్ణ ద్వివేది, యస్‌.వి.వియు ఇన్‌చార్జ్‌ ఉప కులపతి ఉమేష్‌చంద్రశర్మ, ఏపీ, పాండిచ్చేరి డైరెక్టర్లు అమరేంద్ర కుమార్‌, లతామంగేష్కర్‌, డీన్‌లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. చివరి రోజు ముఖ్య అతిథిగా డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రర్‌ డాక్టర్‌ వి.రాధికారెడ్డి, పశువైద్యశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.సత్యకుమారి పాల్గొంటారని చెప్పారు. ఈ కాన్ఫరెన్స్‌కు దేశ నలుమూలల నుంచి మహిళా పశు వైద్యులు, వారు చేసిన పరిశోధనలను విపులంగా తెలియజేస్తారని పేర్కొన్నారు. అనంతరం జాతీయ స్థాయిలో పశువైద్య రంగంలో గణనీయ సేవలను అందించిన వారికి జీవిత సాఫల్య పురస్కారం, ఆంధ్ర రాష్ట్ర ఉత్తమ మహిళా పశువైద్య పురస్కారం అందజేస్తారన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement