బెజ్జూర్: గ్రామీణ మహిళా సంఘాల అభివృద్ధి, కా ర్యకలాపాల నిర్వహణకు ప్రభుత్వం మంజూరు చే సిన విలేజ్ ఆర్గనైజేషన్ (వీవో) భవన నిర్మాణాలు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. భవనాలు మంజూరై నెలలు గడుస్తున్నా పనుల్లో ఆశించిన పు రోగతి కనిపించడం లేదు. జిల్లా వ్యాప్తంగా 335 భ వనాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 70 మాత్ర మే పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నా యి. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడంలో జాప్యం జరుగుతోంది. ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడుతోందనే ఆరోపణలున్నాయి.
రెండు విడతల్లో 335..
తొమ్మిది నెలల క్రితం ఉపాధిహామీ పథకం కింద జి ల్లాకు 222 వీవో భవనాలు మంజూరయ్యాయి. రెండో దఫాలో రెండు నెలల క్రితం వీబీ జీరామ్‌జీ పథ కం కింద మరో 113 భవనాలకు అనుమతులు ల భించాయి. దీంతో మొత్తం భవనాల సంఖ్య 335కు చేరింది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.10లక్షల చొ ప్పున మొత్తం రూ.33.50 కోట్ల వ్యయం కానుంది.
సంఘాలకు బహుళ ప్రయోజనాలు
జిల్లా వ్యాప్తంగా 8,320 స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటి పరిధిలో 386 విలేజ్ ఆర్గనైజేషన్లు పనిచేస్తున్నాయి. వీవో భవనాలు అందుబాటులోకి వస్తే మహిళా సంఘాల సమావేశాలు, పొదుపు, రు ణాల లావాదేవీలు, స్వయం ఉపాధి శిక్షణ, ప్రభు త్వ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఉపయోగపడుతాయి. మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయాలకు కూడా ఈ భవనాలు వేదికగా నిలవనున్నాయి. మహిళా సంఘాల కార్యకలా పాలకు శాశ్వత కేంద్రాలుగా ఈ భవనాలు ఉపయోగపడనున్నాయి.
కొరవడిన పనుల పర్యవేక్షణ
వీవో భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా అధికారుల పర్యవేక్షణ లోపించిందని, నిర్మాణాలు పూర్తికాకపోతే ఆశించిన ప్రయోజనం నెరవేరదని మహిళ సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, భూ మి సమస్యలున్న చోట ప్రత్యామ్నాయ స్థలాలు గుర్తించాలని, నిర్మాణాల్లో జాప్యానికి కారణాలు గుర్తించి మిగతావి గడువులోపు పూర్తి చేయాలని కోరుతున్నారు. రూ.33.50 కోట్లతో చేపట్టిన నిర్మాణాల్లో ఇప్పటివరకు 70 భవనాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 265 నిర్మాణాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయమై డీఆర్డీవో దత్తరావును వివరణ కోరగా.. జిల్లాకు 335 భవనాలు మంజూరు కాగా, ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. భవన నిర్మాణాల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఆయా మండలాల్లో ఇలా..
బెజ్జూర్ మండలానికి 19 వీవో భవనాలు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటివరకు ఐదు భవనాలు మాత్రమే ప్రారంభోత్సవాని కి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మిగతా భవన నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం అనుమతులిచ్చి నెలలు గడుస్తున్నా పనుల్లో వేగం పెరగకపోవడం గమనార్హం. చింతలమానేపల్లి మండలానికి 19 భవనాలు మంజూరు కాగా, ఇప్పటివరకు ఒక్కటి మాత్రమే ప్రారంభోత్సవానికి సిద్ధమైనట్లు సమాచారం. మిగతా భవన నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నా యో.. వాటిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో.. అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కాగా, పెంచికల్‌పేట్ మండలానికి 15 వీవో భవనా లు మంజూరు కాగా, వీటిలో నాలుగు మాత్ర మే పూర్తి కాగా, మిగతా భవన నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. సిర్పూర్(టి) మండలానికి 20 భవనాలు మంజూరు కాగా, 11 చోట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మిగతా తొమ్మిది చోట్ల స్థల సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. భూమి అందుబాటులో లేక నిర్మాణాలు ప్రారంభించనట్లు సమాచారం.


