ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సే వాధికారి సంస్థ కార్యదర్శి శారదాదేవి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ని బాలుర ఆశ్రమ పాఠశాలలో శనివారం చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు మాదకద్రవ్యాల దూరంగా ఉండాలని తెలిపారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్‌ను సొంతం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదివితే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు పోక్సో, బాల్య వివాహాలు, బాల కార్మిక చ ట్టాలపై అవగాహన ఉండాలని తెలిపారు. డీ సీపీవో మహేశ్, హెచ్‌ఎం కిషన్ పాల్గొన్నారు.


