కౌటాల: కౌటాల కంకలమ్మ జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించాలని సీఐ సంతోష్‌కుమార్ సూ చించారు. మండల కేంద్రంలోని పోలీస్ సర్కిల్ కా ర్యాలయంలో సీఐతోపాటు ఎస్సై సతీశ్‌కు కమిటీ స భ్యులు జాతర ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయం వరకు బారికేడ్లు ఏర్పా టు చేయాలని సూచించారు. డిసెంబర్ 6న జాతర నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సుల్వ కనకయ్య తెలిపారు. అనంతరం కౌటాల తహసీల్దా ర్ ప్రమోద్‌కుమార్, సర్పంచ్ నక్క శంకర్‌కు జాతర ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు రాములు, సత్తయ్య, నారాయణ, తిరుపతి, బాపు తదితరులు పాల్గొన్నారు.


