ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు వెంకటేశ్, వర్షిత్ జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రహీం తెలిపారు. శనివారం పాఠశాల ఆవరణలో పీడీ యాదగిరి, ప్రసాద్‌తో కలిసి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల నిజామాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీ య స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ నెల 24నుంచి 28వ తేదీ వరకు పంజాబ్‌లో నిర్వహించనున్న జాతీయ స్థా యి పోటీల్లో వీరు పాల్గొంటారని తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో విద్యార్థులు విజయం సాధించాలని ఆకాంక్షించారు.


