ఆసిఫాబాద్‌రూరల్: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేదలకు వరమని డీసీసీ అధ్యక్షురాలు సుగుణక్క పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఇందిరమ్మ బీమా పథకం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో బీమా పథకానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. 18–59 ఏళ్లున్న అర్హులంతా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డీసీసీ ఉపాధ్యక్షుడు తారిక్, మండలాధ్యక్షుడు ము రళి, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆనంద్, నియోజకవర్గ అధ్యక్షుడు నారాయణ, ప్రసాద్, నాయకులు ఆనంద్, రాము, జానకీరాం తదితరులున్నారు.


