కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్ వద్ద ఇంపాక్ట్ ఇండియా ఆధ్వర్యంలో లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్‌లో ఆది, సోమవారాల్లో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు తెలిపారు. శనివారం ఆయన స్థానికంగా మాట్లాడుతూ.. దసరా సందర్భంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో చాలామంది సేవలు సద్వినియో గం చేసుకోలేకపోయారని పేర్కొన్నారు. దీంతో మరో రెండ్రోజులపాటు కంటి పరీక్షలు నిర్వహించడానికి లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారని తెలిపారు. కంటి పరీక్షలు అవసరమైన వా రు, చూపు మందగించినవారు ఈ అవకాశాన్ని త ప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.
ఆసిఫాబాద్‌రూరల్: ఆది, సోమవారాల్లో కాగజ్‌నగర్ రైల్యేస్టేషన్‌లో లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో నాగేంద్ర శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. కంటి సమస్యలున్నవారు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని సూచించారు.


