సర్వే జాప్యం | - | Sakshi
Sakshi News home page

సర్వే జాప్యం

Nov 1 2026 12:27 AM | Updated on Nov 1 2026 12:27 AM

అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం జిల్లాలో నత్తనడకన సాగుతున్న ప్రక్రియ 1,223 ఎకరాల భూమి నిరుపయోగం ప్రభుత్వ కార్యాలయాలకు స్థల సమస్య ఉమ్మడి సర్వే చేస్తేనే హద్దుల నిర్ధారణ

సమన్వయ లోపం..

పెంచికల్‌పేట్‌: ప్రభుత్వ అవసరాలకు వినియోగించాల్సిన ప్రభుత్వ భూమి రెవెన్యూ, అటవీశాఖల అధికారుల మధ్య సమన్వయ లోపంతో నిరుపయోగంగా మారుతోంది. మండలంలోని ఎల్కపల్లి శివారులోని సర్వే నంబర్‌ 61లో 1,223 ఎకరాల ప్ర భుత్వ భూమి ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అయితే, ప్రభుత్వ భూమికి హద్దుల నిర్ధారణ, భూమి కొలతలు శాసీ్త్రయంగా నిర్ధారించకపోవడంతో భూసర్వే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రెవెన్యూ, అటవీశాఖల మధ్య నెలకొన్న వివాదంతో జాప్యం జరుగుతోంది. ఫలితంగా ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణానికి అవసరమైన భూ మి గుర్తించడం సవాల్‌గా మారింది. ఎల్కపల్లి శివా రులో సంయుక్తంగా జాయింట్‌ సర్వే నిర్వహించాల ని అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇవ్వడంతో సర్వే బృందాలు జాయింట్‌గా ఒక్కరోజు సర్వే నిర్వహించాయి. అధికారులు సర్వే నంబర్‌ 61కి రెండు హద్దులు మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు. దీంతో భూ సర్వేపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ప్రక్రియలో ఆలస్యం

ప్రజలకు మెరుగైన సేవలందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పెంచికల్‌పేట్‌ మండలాన్ని ఎల్కపల్లి కేంద్రంగా 2016లో ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు మండల కేంద్రంలో పోలీస్‌స్టేషన్‌, కస్తూర్బా పాఠశాల, మండల విద్యావనరుల కేంద్రం, రైతు వే దిక భవనాలను మాత్రమే నిర్మించింది. ఎల్కపల్లి లో అధిక విస్తీర్ణంలో ప్రభుత్వ భూములున్నాయి. ఎల్కపల్లి శివారులోని ప్రభుత్వ భూములు అటవీ శాఖకు చెందినవని అటవీశాఖ అధికారులు వాదిస్తున్నారు. దీంతో సదరు భూముల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. ప్రధాన రహదారికి అవతలి వైపు ఉన్న భూముల్లో నిర్మాణాలకు ఆంక్షలు విధిస్తుండడంతో మండల కేంద్రంలో భూముల కొరత ఏర్పడింది. అభివృద్ధి పనులు, కార్యాలయాల భవన నిర్మాణాలకు భూమి లేక తాత్కాలిక భవనాల్లో తహసీల్‌, ఎంపీడీవో, ఇతర కార్యాలయాలు నిర్వహిస్తూ సేవలందిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఆయా పార్టీలకు చెందిన నాయకులు ప్రజావాణిలో వినతిపత్రాలు అందజేశారు.

ఉమ్మడిగా సర్వే చేస్తేనే..

రెవెన్యూ, అటవీశాఖల అధికారులు ఉమ్మడిగా సర్వే నిర్వహించి హద్దులు నిర్ధారించాల్సి ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఏటా నామమాత్రంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఇరు శాఖలకు చెందిన అధికారులు సంబంధిత రికార్డులతో హాజరుకాకపోవడంతో సర్వే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అక్టోబర్‌ మొదటి వారంలో సర్వే బృందం ఎల్లూర్‌, ఎల్కపల్లి శివారులో హద్దులు ఏర్పాటు చేసింది. తిరిగి సర్వే ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో సమస్య పరిష్కారమయ్యే అవకాశం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సర్వే చేపట్టి ప్రభుత్వ భూమికి పకడ్బందీగా హద్దులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement