ఆసిఫాబాద్‌అర్బన్: అత్యవసర సమయాల్లో మన రక్తం మరొకరికి ప్రాణాధారం అవుతుందని ఎస్పీ నితిక పంత్ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో రక్తదాన శిబి రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, సామాజిక బాధ్యతలో భాగంగా సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుందని తెలి పారు. శిబిరంలో రక్తదానం చేసిన యువత, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జర్నిలిస్టులను ఎస్పీ అభినందించారు. శిబిరంలో 400 మంది రక్తదానం చేశారు. వీరి నుంచి సేక రించిన 400 యూనిట్ల రక్తాన్ని ఆసిఫాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రులకు అందజేసినట్లు అధికారులు తెలిపారు.


