వెడ్మ రాము ఆశయ సాధనకు కృషి చేయాలి | - | Sakshi
Sakshi News home page

వెడ్మ రాము ఆశయ సాధనకు కృషి చేయాలి

Nov 1 2026 12:27 AM | Updated on Nov 1 2026 12:27 AM

తిర్యాణి: వెడ్మ రాము ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐటీడీఏ పీవో మంద మకరందు సూచించారు. వెడ్మ రాము 39వ వర్ధంతి సందర్భంగా మండలంలోని ఎదులపహడ్‌ గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. గిరిజన గ్రామాలాభివృద్ధికి ఐటీడీఏ నిరంతరం పని చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం అమలు చే స్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన గిరి జనులు లబ్ధి పొందేలా చూడాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని తెలిపారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మండల కేంద్రంలోని ఆశ్రమ బాలుర పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన పోషకాహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. వర్ధంతి నిర్వహణ కమిటీ అధ్యక్షుడు ఆత్రం సంతోష్‌, నాయకులు వెడ్మ తిరుపతి, దస్రు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement