ఆసిఫాబాద్‌రూరల్: పుస్తకాల పరిజ్ఞానమే కా కుండా విద్యార్థులకు నైపుణ్య ఆధారిత విద్య ను అందించాలని జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ సూచించారు. శనివా రం జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన ఫ్రీ వొకేషనల్ ఎడ్యుకేషన్, కౌశల్ బోధ్ ముగింపు కార్యక్రమానికి హాజరై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీ య విద్యా విధానం–2020 లక్ష్యాలకు అనుగుణంగా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో వృత్తి విద్య, పనిపై గౌరవం, స్వయం ఉపాధి ఆలోచన, సృజనాత్మకత, సమస్యలు పరిష్కరించే సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరముందని చెప్పారు. మూడ్రోజుల శిక్షణలో నేర్చుకు న్న అంశాలను పాఠశాలల్లో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్ మహేశ్వర్, రిసోర్స్ పర్సన్లు సదానందం, సందీప్, సతీశ్, జయశ్రీ తదితరులున్నారు.


