చట్టాలను యధావిధిగా కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

చట్టాలను యధావిధిగా కొనసాగించాలి

Nov 1 2026 12:39 AM | Updated on Nov 1 2026 12:39 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: ఎన్నో పోరాటాలు, తాగ్యాలతో సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని ఆరోపించారు. ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం పట్టణంలోని ఎమ్మెల్యేస్‌ పాయింట్‌లో యూనియన్‌ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1920లో ఆవిర్భవించిన ఏఐటీయూసీ ఈ దేశానికి పూర్తి స్వాతంత్య్రం కావాలని పోరాటం చేసిన మొదటి యూనియన్‌ అని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయాలని, కనీస వేతనం రూ.26వేలుగా నిర్ణయించి అమలు చేయాలని, 8 గంటల పనిదినాన్ని అమలు పరచాలని పీఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీపై ఉన్న సీలింగ్‌ను ఎత్తివేయాలని, కనీస పెన్షన్‌ రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, కుమార్‌, సురేశ్‌, రాజు, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement