కెరమెరి: బాలల హక్కుల పరిరక్షణ, భద్రత అందరి సామాజిక బాధ్యత అని జిల్లా న్యాయమూర్తి అనూష స్పష్టం చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో లీగల్ లిటరసీ క్యాంపులో భాగంగా ‘సురక్షిత్ బచ్చన్ అభియాన్’ కార్యక్రమాన్ని శనివారం మండలంలోని జోడేఘాట్, మోడి ఆశ్రమ ఉన్నత పాఠశాలలు, కెరమెరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నిర్వహించారు. విద్యార్థులకు న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించి చట్టా లపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. విద్యార్థులు తమ వ్యక్తగత భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన కలి గి ఉండాలని, ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే తల్లి దండ్రులు, ఉపాధ్యాయులకు లేదా నమ్మకమైన పెద్దలకు తెలుపాలని పిలుపునిచ్చారు. బాలికలపై జరిగే లైంగిక వేధింపులు, దాడులను అరికట్టేందు కు 2012 పోక్సో చట్టం ఎంతో రక్షణ కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థులకు సురక్షిత వాతావరణం కల్పించినప్పుడే సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నేరాలకు పాల్పడే వా రికి శిక్ష తప్పదని, నేరాలను అరికట్టేందుకు పోలీసులు ముందుంటారని, సమస్యలు ఎదురైనప్పుడు దాచిపెట్టకుండా తమను ఆశ్రయించాలని ఎస్సై రాజు సూచించారు. ఎంఈవో ప్రకాశ్, హెచ్‌ఎంలు చంద్రశేఖర్, ప్రేందాస్ తదితరులున్నారు.
విద్యార్థినులకు చట్టాలపై అవగాహన
ఆసిఫాబాద్ క్రైమ్: కాగజ్‌నగర్ పట్టణంలోని వివిధ పాఠశాలల్లో షీ టీం ఆధ్వర్యంలో బాలికలు, మహిళల భద్రతపై అవగాహన కల్పించారు. జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సాంకేత్ మిత్ర పాల్గొని న్యాయ సంబంధిత విషయాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. షీ టీం ఏఎస్సై సునీత మాట్లాడుతూ.. ఎలాంటి వేధింపులెదురైనా తక్షణమే షీ టీంకు సమాచారం ఇవ్వాలని లేదా 8712670565 నంబర్‌కు వాట్సాప్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఆపద సమయంలో 100, 112 నంబర్లనూ వినియోగించాలని సూచించారు.


