గజవాహనంపై కేశవనాథుడి శోభాయాత్ర | - | Sakshi
Sakshi News home page

గజవాహనంపై కేశవనాథుడి శోభాయాత్ర

Oct 20 2026 12:14 AM | Updated on Oct 20 2026 12:14 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ కేశవనాథస్వామి ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు వైభవోపేతంగా కొనసాగాయి. సోమవారం చివరిరోజు స్వామి వారి ఉత్సవ విగ్రహాన్ని గజవాహనంపై ఉంచి పట్టణ వీధుల గుండా భాజాభజంత్రీల మధ్య, భక్తి పాటలతో భజనలు చేసుకుంటూ శోభాయాత్ర నిర్వహించారు. అర్చకులు ఒజ్జల నరేష్‌శర్మ ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. శోభాయాత్ర కు మహిళలు మంగళహారతులతో స్వాగతం ప లికారు. అనంతరం ఆలయంలో మంగళహార తి, మహా మంత్రపుష్పం, ఆశీర్వచనం, తీర్థప్రసాద వితరణ చేశారు. ఆలయ ఈవో వేణుగోపాల్‌ గుప్తా, బ్రాహ్మణ సమాజ్‌ అధ్యక్షులు వైరాగడె ప్రతాప్‌, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement