కాగజ్‌నగర్‌టౌన్: ఉద్యోగుల సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని కోసిని గ్రామంలోని ఆయన నివాసంలో నేషనల్ హెల్త్ మిషన్‌లో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది ఆయనను కలిసి సమస్యలు విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల సర్వీస్ ఉన్న రెగ్యులర్ అటెండర్ జీతం రూ.90 వేలు ఉంటే, 20 ఏళ్ల నుంచి డాక్టర్‌గా పని చేస్తున్న ఉద్యోగి జీతం కేవలం రూ.45 వేలు మాత్రమే ఉందని, దీనికి కారణం ఉద్యోగుల భద్రత లేకపోవడమే అన్నారు. వారం రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


