ఆసిఫాబాద్‌అర్బన్: జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22 నుంచి నవంబర్ 14 వరకు జిల్లాలో ప్రత్యే క సర్వే నిర్వహించనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పిస్తూ, లక్షణాలు ఉన్నవారిని గుర్తించనున్నట్లు తెలిపారు. 118 సబ్ సెంటర్‌లు ఏర్పాటు చేశామని, 728 మంది ఆశ వర్కర్లు సర్వేలో పాల్గొననున్నట్లు తెలిపా రు. సమావేశంలో డీఎంహెచ్‌వో నాగేంద్ర, ప్రోగ్రాం అధికారి బీపీఎం రాములు నాయక్, తదితరులు పాల్గొన్నారు.


