బెల్లంపల్లి: బెల్లంపల్లి మండలం తాళ్ల గురిజాల గ్రామంలో సోమవారం బెల్లంపల్లి పోలీసు శాఖ సౌజన్యంతో ఖేలో ఇండియా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అండర్ –17 విభాగంలో వాలీబాల్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా అంతర్జాతీయ వాలీబాల్ మాజీ క్రీడాకారుడు రవి హాజరై మాట్లాడారు. క్రీడల్లో రాణించడం వల్ల పేరు ప్రఖ్యాతలు రావడంతోపాటు ఉద్యోగావకాశాల్లో కోటా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లగురిజాల సర్పంచ్ వంగ రాము, ఎస్సై ప్రశాంత్‌కుమార్, చంద్రవెల్లి సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ సురేష్, వార్డు సభ్యులు, సీనియర్ క్రీడాకారులు తదితరలు పాల్గొన్నారు.
బాలుర జట్టు..
వికాస్(నేరడిగొండ), సాయి దీక్షిత్(మంచిర్యాల), శంకర్(దండేపల్లి), అభిరామ్(లింగాపూర్), సుశాంత్(మంచిర్యాల), అనాజ్ (ఆదిలాబాద్), జశ్వంత్ నాయక్(ఆదిలాబాద్), శ్రీనివాస్ (బాబాసాగర్), కార్తీక్ (కోటపల్లి), సదానందం (నిర్మల్), రాహుల్ (తాళ్ల గురజాల), శ్రవణ్‌కుమార్, మహేశ్ (బట్వాన్పల్లి), గోవిందు (తిర్యాణి), పరశురాం (నేరడిగొండ), సాయిప్రదీప్ (మంచిర్యాల).
బాలికల జట్టు..
హరిప్రియ (లక్సెట్టిపేట), రుతిజ(నిర్మల్), సాయి వైష్ణవి (కోటపల్లి), హర్షిణి (తిర్యాణి), పూజిత (నిర్మల్), శ్రావణి (ఆసిఫాబాద్), మహాలక్ష్మి (ఇచ్చోడ), మధురక్షి (ఆసిఫాబాద్), వైష్ణవి (నిర్మల్), అనుష్క (ఆదిలాబాద్), జ్యోతి (ఆదిలాబాద్), అంజలీదేవి (ఆదిలాబాద్), అమూల్య (అచ్చులాపూర్), శ్రావణి (తాళ్లపేట), సరిత(కౌటాల), రుచిత (రెబన్పల్లి).


