గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా | - | Sakshi
Sakshi News home page

గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా

Oct 20 2026 12:20 AM | Updated on Oct 20 2026 12:20 AM

రెబ్బెన: జిల్లాలో గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎస్పీ నితిక పంత్‌ అన్నారు. మండలంలోని కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద సోమవారం రెబ్బెన పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన భార్యభర్తలను తనిఖీ చేయగా వారి వద్ద రూ. 2.70 లక్షల విలువైన 5.232 కిలోల గంజాయి పట్టుబడింది. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఈస్గాంకు చెందిన జుముర్‌ గెయిన్‌, సురంజన్‌ గెయిన్‌లు భార్యభార్తలు. భర్త ఎస్పీఎంలో ఉద్యోగి. ప్రస్తుతం కాగజ్‌నగర్‌లోనే నివాసం ఉంటున్నారు. ఈనెల 14న జుముర్‌ గెయిన్‌ ఒడిశాకు వెళ్లి పింటూ వద్ద రూ.15వేలకు 5.232 కిలోల గంజాయిని కొనుగోలు చేసి మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో దిగింది. అక్కడి నుంచి భర్తతో కలిసి స్కూటర్‌పై కాగజ్‌నగర్‌కు బయలుదేరారు. రెబ్బెన నుంచి కాగజ్‌నగర్‌కు గంజాయి అక్రమ రవాణా జరుగుతున్నట్లు అందిన పక్కా సమాచారంతో పోలీసులు కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. భార్యాభర్తలు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా గంజాయి లభ్యమైంది. వారి నుంచి రెండు సెల్‌ఫోన్లు, స్కూటర్‌ స్వాధీనం చేసుకుని వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గంజాయి అక్రమ సరాఫరా వ్యవహారంలో ఒడిశాకు చెందిన పింటూతో పాటు మంచిర్యాలకు చెందిన మున్నీ, జైపూర్‌కు చెందిన చంద్రశేఖర్‌, రాజు తదితరుల పాత్రపై సైతం పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణా జరగకుండా ముందస్తుగానే గుర్తించి నిందితులను అరెస్టు చేసి స్వాధీనం చేసుకున్న డీఎస్పీ అశోక్‌, రెబ్బెన ఇన్‌చార్జి సీఐ వేణుగోపాల్‌, రెబ్బెన ఎస్సై వెంకటకృష్ణ, పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement