వేతనాలు చెల్లించకపోవడం బాధాకరం | - | Sakshi
Sakshi News home page

వేతనాలు చెల్లించకపోవడం బాధాకరం

Oct 20 2026 12:14 AM | Updated on Oct 20 2026 12:14 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: మిషన్‌ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించకపోవడం బాధాకరమని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్షి బోగె ఉపేందర్‌ అన్నారు. కార్మికులకు పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం డీఆర్‌ఏ దాసరి వేణుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాణిక్‌గుడ వాటర్‌ ప్లాంట్‌లో రాఘవ ఏజెన్సీ సబ్‌ ఎవరెస్ట్‌ ద్వారా పనిచేస్తున్న కార్మికులకు 5 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో పండుగ పూట పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్‌, కార్మికులు తిరుపతి, శ్రీకాంత్‌, రాజేశ్వర్‌, సుధాకర్‌, జయకృష్ణ, హరీష్‌, వేణు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement