ఆసిఫాబాద్‌అర్బన్: విజయదశమి ప్రతీఒక్కరికి విజయాలు చేకూర్చాలని ఎస్పీ నితిక పంత్ అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్‌లో ఆయుధ పూజ, వాహనపూజ, జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దుర్గాదేవికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం అప్రమత్తంగా ఉండే పోలీసులు విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు, వాహనాలను దైవ స్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించ డం సంప్రదాయంగా వస్తుందన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.


