ఆదిలాబాద్‌ కలెక్టర్‌ను కలిసిన భీం మనుమడు | - | Sakshi
Sakshi News home page

ఆదిలాబాద్‌ కలెక్టర్‌ను కలిసిన భీం మనుమడు

Oct 20 2026 12:20 AM | Updated on Oct 20 2026 12:20 AM

కైలాస్‌నగర్‌: గిరిజన పోరాట యోధుడు కొమురంభీం మనుమడు కొమురం సోనేరావు సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలిసి శాలువాతో సత్కరించారు. ఆసిఫాబాద్‌ జిల్లా జోడేఘాట్‌లో ఈ నెల 26న నిర్వహించనున్న కొమురం భీం వర్ధంతి కార్యక్రమానికి రావాలని కోరుతూ ఆహ్వానపత్రికను అందజేశారు. అనంతరం కార్యక్రమ వాల్‌ పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు.

కోడిపందేలు ఆడిన ముగ్గురు బైండోవర్‌

బెజ్జూర్‌: కోడిపందేలు ఆడుతూ పట్టుబడిన ముగ్గురు వ్యక్తులను బైండోవర్‌ చేసినట్లు ఎస్సై రమేశ్‌ తెలిపారు. సోమవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సులుగుపల్లి గ్రామ శివారులో గల గంగారంగూడ ప్రాంతంలో కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు దాడి చేసి ముగ్గురిని పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.300 నగదు, మూడు కోళ్లు, మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ముగ్గురిని బెజ్జూర్‌ తహసీల్దార్‌ ఎదుట హాజరుపర్చి బైండోవర్‌ చర్యలు చేపట్టారు. మరోసారి కోడిపందేలకు పాల్పడితే ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున బైండోవర్‌ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement