ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని గిరిజన మోడల్ స్పోర్ట్స్ స్కూల్ (బాలికలు)లో శుక్రవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక పంత్ హాజరై బతుకమ్మ ఆడారు. వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని పేర్కొన్నారు. వేడుకల్లో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల్ల మంగ, డీటీడీవో అంబాజి, జీడీసీ శకుంతల, డీఎస్వో మడావి శేఖు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లింబారావ్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
బతుకమ్మ ఆడుతున్న కలెక్టర్ హరిత, ఎస్పీ నితిక పంత్


