కాగజ్‌నగర్‌టౌన్: తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక అంశాలపై విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి ఎన్.జశ్వంత్ ప్రతిభ చూపాడు. రాష్ట్రస్థాయి బహుమతి సాధించినట్లు ప్రిన్సి పాల్ శ్రీదేవి తెలిపారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాల గొప్పదనాన్ని వివరిస్తూ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ రాష్ట్రస్థాయిలో ఎంపికై ంద ని పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో శని వారం నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించి బహుమతి ప్రదానం చేశారు.


