అమ్మకు రక్తహీనత! | - | Sakshi
Sakshi News home page

అమ్మకు రక్తహీనత!

Sep 26 2026 12:32 AM | Updated on Sep 26 2026 12:32 AM

ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఎనీమియా గర్భిణులు, బాలింతల్లోనే అధికం తగ్గుతున్న హిమోగ్లోబిన్‌ స్థాయి ఆరు నెలల్లో 2,343 మంది బాధితుల గుర్తింపు

కెరమెరి మండలం చిన్నసాకడ గ్రామానికి చెందిన కుర్సెంగ తానుబాయి రక్తహీనత ఏర్పడింది. అలాగే రెండు రక్తనాళాలు మూసుకుపోవడంతో ఈ నెల 23న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన వెంటనే ఆదిలాబాద్‌ రిమ్స్‌లో మృతి చెందింది. రెండో ప్రసవానికి 16 ఏళ్ల వ్యవధి ఉండడంతో ప్రసూతిలో ఇబ్బంది ఎదురైందని వైద్యులు తెలిపారు.

కెరమెరి మండలం చింతకర్రకు చెందిన కుమురం మనీష ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భంతో ఉంది. ఇది ఆమెకు మూడో కాన్పు. 12 గ్రాముల హిమోగ్లోబిన్‌ ఉండాల్సి ఉండగా, 6.6 గ్రాములు మాత్రమే ఉంది. ఏప్రిల్‌లో 10.8 గ్రాములు ఉండగా, జూలైలో 9.6, ఇప్పుడు 6.6కి చేరింది. మధ్యలో నెలనెలా పరీక్షలు చేయించుకోకపోవడంతో ఎనీమియా తీవ్రతను గుర్తించలేకపోయారు. ఇలా.. జిల్లాలో గర్భిణులు, బాలింతలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఫలితంగా తల్లులతోపాటు పుట్టబోయే బిడ్డల ఆరోగ్యంపైనా ప్రభావం పడుతోంది.

కెరమెరి: పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన తల్లులకు రక్తహీనత శాపంగా మారుతోంది. పౌష్టికాహార లో పం, అవగాహన రాహిత్యంతో గిరిజన ప్రాంతాల్లో ని గర్భిణులు, బాలింతల ప్రాణాలు తీవ్ర ముప్పు ను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం పౌష్టికాహారం సరఫరా చేస్తున్నా.. వైద్య సిబ్బంది పరీక్షలు చేస్తు న్నా అనీమియాకు పరిష్కారం దొరకడం లేదు. ఇటీవల ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఓ గిరిజన తల్లి ప్రసవించి మృతి చెందిన ఘటన పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలోని ప్రతీ పది మంది మహిళల్లో ఆరుగురు రక్తహీనతతో బాధపడుతున్నారు. అలాగే బాలింత మరణాల్లో 70 శాతానికి రక్తహీనతే కారణమవుతోందని అనేక నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి.

జాగ్రత్తలు తప్పనిసరి

వైద్యులు సూచించిన ఆహారం తీసుకుంటే రక్తహీనతను అధిగమించవచ్చు. ఐరన్‌ అధికంగా ఉండే తోటకూర, పాలకూర వంటి ఆకుకూరలతో పాటు బెల్లం, వేరుశెనగలు, నువ్వులు, ఖర్జూరం, ఎండుద్రాక్ష తీసుకోవాలి. వీలైతే చికెన్‌, లివర్‌, గుడ్లు తీసుకోవడం ద్వారా పోషకాహారం లభిస్తుంది. విటమి న్‌ సీ కోసం నిమ్మ జాతి పండ్లు, ఉసిరి వంటివి ఆ హారంలో భాగం చేసుకోవాలి. ఐరన్‌, ఫోలిక్‌ యాసి డ్‌ మాత్రలను క్రమం తప్పకుండా వేసుకోవాలి. టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. అలాగే వైద్యశాఖ ఆధ్వర్యంలోనూ గర్భిణులకు పీహెచ్‌సీల ద్వారా ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతిరోజూ వారికి గుడ్లు, పాలు పంపిణీ చేస్తున్నారు. తీవ్ర రక్తహీనత ఉన్నవారికి పీహెచ్‌సీల్లోనే ఐరన్‌ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ‘అమ్మ ఒడి’ వాహనాల ద్వారా ఎంసీహెచ్‌ ఆస్పత్రులకు తరలిస్తూ నిత్యం పరీక్షలు చేయిస్తున్నారు. ప్రసవమయ్యే వరకు సమీపంలో ఉండే ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నారు.

నిత్యం పరీక్షలు చేయించుకోవాలి

కిడ్నీ, తలసేమియా, ఇతర వ్యాధులు ఉన్నవారిలో అధికంగా రక్తహీనత ఏర్పడుతుంది. గర్భిణులు, బాలింతలకు 7శాతం కంటే తక్కువ హిమోగ్లోబిన్‌ స్థాయి తక్కువగా ఉంటే నిత్యం ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకోవాలి. వైద్యుల సూచనల మేరకు ఇంజెక్షన్లు, మాత్రలు తీసుకోవాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారంతోపాటు ఇంట్లోనూ సరైన ఆహారం తీసుకుంటే ఎనీమియాను అధిగమించవచ్చు.

– ఆర్‌ఎస్‌ నాగేంద్ర, డీఎంహెచ్‌వో

గిరిజన మహిళల్లోనే అధికం..

జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసించే మహిళల్లో అనీమియా సమస్య ఎక్కువగా వేధిస్తోంది. పౌష్టికాహారం అందుబాటులో లేకపోవడం, క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకోకపోవడం, అవగాహన లోపం తదితర అంశాలు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. కొందరు మహిళలు ఆరోగ్య సమస్యలను పెద్దగా పట్టించుకోకుండా ఇంటిపనుల్లో నిమగ్నమవుతుండడంతో సమస్య తీవ్రతరమవుతోంది. గర్భధారణ సమయంలో రక్తహీనత ఉంటే నీరసం, అలసట, తల తిరగడం వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది. గర్భిణులు రక్తహీనతను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

159 మందికి తీవ్రస్థాయి సమస్యలు

జిల్లాలో 8,591 మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారు. ఆరు నెలల్లో 2,343 రక్తహీనతతో బా ధపడుతున్నట్లు గుర్తించారు. ఇందులో 159 మందిలో హిమోగ్లోబిన్‌ 7 నుంచి 9 గ్రాముల మధ్య ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గర్భధారణ సమయంలో హిమోగ్లోబిన్‌ స్థాయి తగ్గితే గర్భంలోని శిశువుపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. తక్కువ హిమోగ్లోబిన్‌ ఉన్న వారిపై వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సరైన పోషకాహారం అందకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ఆహారపు అలవా ట్లు, వరుస గర్భధారణలు తదితర కారణాలతో మహిళల్లో హిమోగ్లోబిన్‌ స్థాయిలు తగ్గుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement