బై బై గణేశా.. | - | Sakshi
Sakshi News home page

బై బై గణేశా..

Sep 26 2026 12:32 AM | Updated on Sep 26 2026 12:32 AM

పెద్దవాగులో గణనాథుడిని

నిమజ్జనం చేస్తున్న భక్తులు

జిల్లాలో శుక్రవారం గణేశ్‌ నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం మహిళలు, చిన్నారులు నృత్యాలతో వినాయకుడికి బైబై చెప్పారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని లారీ చౌరస్తా వద్ద హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి ఎమ్మెల్సీ దండె విఠల్‌, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, తహసీల్దార్‌ మధుకర్‌ పూజలు చేశారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేతోపాటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, డీఎస్పీ ఎండీ వహీదుద్దీన్‌, రూరల్‌ సీఐ కుమారస్వామి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మూడంచెల భద్రత మధ్య పెద్దవాగులోకి ఎవ్వరూ వెళ్లకుండా ఉండేందుకు చుట్టూ గ్రీన్‌ మ్యాట్‌ కంచెలు ఏర్పాటు చేసి క్రేన్‌ సహాయంతో విగ్రహాలను నిమజ్జనం చేశారు. తహసీల్దార్‌ మధుకర్‌, ఎంపీడీవో ఉజ్వల్‌కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి భక్తులు, అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. – కాగజ్‌నగర్‌టౌన్‌

కాగజ్‌నగర్‌ పట్టణంలో శోభాయాత్ర

గణనాథుడిని తీసుకువస్తున్న భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement