సామూహిక వందేమాతరం గీతాలాపన | - | Sakshi
Sakshi News home page

సామూహిక వందేమాతరం గీతాలాపన

Sep 26 2026 12:26 AM | Updated on Sep 26 2026 12:26 AM

కాగజ్‌నగర్‌టౌన్‌: వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యాభారతి అఖిలభారత శిక్ష సంస్థాన్‌ ఆధ్వర్యంలో నమామి భారత్‌ పేరుతో పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలు, ఆర్వవైశ్య, పద్మశాలి భవనంలో శుక్రవారం సామూహిక వందేమాతర గీతాలాపన చేపట్టారు. శ్రీ సరస్వతి శిశుమందిర్‌ ద్వారకానగర్‌ పాఠశాల కమిటీ సభ్యులు చిలువేరు ప్రవీణ్‌కుమార్‌, పాలెపు మురళీధర్‌, రాచకొండ గిరీష్‌, కొడిప్యాక సంతోష్‌, రంగస్వామి, కృష్ణ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రముఖులు హాజరై వందేమాతరం ఆలపించారు. నేటి తరం యువత తప్పనిసరిగా వందేమాతరం ప్రాముఖ్యతను తెలుసుకోవాలని వారు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement