ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు

Sep 26 2026 12:26 AM | Updated on Sep 26 2026 12:26 AM

● కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌అర్బన్‌: 2026– 27 వానాకాలం సీజన్‌ వరిధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి వరిధాన్యం కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లపై వ్యవసాయశాఖ అధికారులు, సహకార శాఖ ఐకేపీ సిబ్బంది, కేంద్రాల నిర్వాహకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వానాకాలం సీజన్‌లో 23,900 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని, అక్టోబర్‌ 1న అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఆదేశించారు. ఎత్తైన, రోడ్డుకు సమీపంలోని ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాలని, తాగునీరు. నీడ తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు. రెండు ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలు, గోనె సంచులు, ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు, డ్రయర్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తూకం వేసిన ధా న్యాన్ని వేగంగా మిల్లులకు తరలించాలని సూచించారు. మద్దతు ధర, సన్నవడ్లకు రూ.500 బోనస్‌ వివరాలు రైతులకు తెలిసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఏవో వెంకట్‌, డీఎస్‌వో వాజిద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement