రెబ్బెన: వనపర్తిలో ఆదివారం జరిగిన 72వ బాల్‌బ్యాడ్మింటన్ అంతర్ జిల్లాల పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మహిళా జట్టు అద్భుత ఆటతీరు ప్రదర్శించింది. ఫైనల్‌లో రంగారెడ్డి జట్టుతో ఓటమి పాలుకాగా, రెండోస్థానంలో నిలిచిన ఆదిలాబాద్ జిల్లా మహిళల జట్టు సిల్వర్ మెడల్ కై వసం చేసుకుంది. ఇదే టోర్నమెంట్‌లో జిల్లా పురుషుల జట్టు సెమీ ఫైనల్‌లో హైదరాబాద్ జట్టుతో ఓటమిపాలై నాలుగో స్థానంలో నిలిచినట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్.తిరుపతి తెలిపారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, కుమ్మరి మల్లేశ్, శ్రీధర్, నరేష్ క్రీడాకారులను అభినందించారు.


