కాగజ్‌నగర్‌టౌన్: ఆదివాసీ సంస్కృతి పరిరక్షణకు కృషి చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనం సచిన్ అన్నారు. ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బాలభారతి పాఠశాల నుంచి రాజీవ్‌గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హక్కులు, సంస్కృతి పరిరక్షణ, జీవో 3 పునరుద్ధరణ, 1/70 రక్షణకు ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీలో కలపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ముంజం ఆనంద్‌కుమార్, నేర్పల్లి అశోక్, కోట శ్రీనివాస్, దిగిడ బక్కన్న, మడావి గణపతి, డి.లక్ష్మి, కనక నగేష్, శంకర్, ఆత్రం మాణిక్‌రావు, రవీందర్, కొడప సాంబయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.


