కెరమెరి: ఆదివాసీ చట్టాలపై అవగాహన అవసరమని తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు కోట్నాక విజయ్ అన్నారు. మండలంలోని జోడేఘాట్‌లో ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కుమురంభీం విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. వివిధ అంశాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు ఏటా ఆగస్టు ప్రపంచ ఆదివాసీ దినోత్స వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్, భీం మనుమడు కుమురం సోనేరావు, పోరుగ్రామాల అధ్యక్షుడు పెందోర్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


