కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని భట్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల బెల్టు షాపులు మూసివేయాలని ఐద్వా, డీవైఎఫ్‌ఐ, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం జీపీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఐద్వా జిల్లా కార్యదర్శి దుర్గం అనిత మాట్లాడుతూ బెల్టు షాపులతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి తక్షణమే బెల్టు షాపులను మూసివేయాలని కోరారు. అనంతరం సర్పంచ్ రాజేందర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు ముంజం ఆనంద్, వినోద తదితరులు పాల్గొన్నారు.


