రుచికరమైన భోజనం అందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలని జిల్లా సైన్స్ అధికారి మధుకర్, ఎంఈవో సుభాష్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి వంటల పోటీలు నిర్వహించారు. జిల్లాలో వివిధ మండలాల నుంచి మధ్యాహ్న భోజన వంట కార్మికులు జిల్లా స్థాయి పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆసిఫాబాద్ మండలంలో సాయిబాబా గ్రూప్‌కు చెందిన లక్ష్మి, పెంటుబాయి ప్రథమ బహుమతి, సిర్పూర్ ఉన్నత పాఠశాలలో వంట చేసే అంకమ్మ దేవి ఏజెన్సీకి చెందిన లక్ష్మి, కమల ద్వితీయ బహుమతి దక్కించుకున్నారు. పోటీల్లో పాల్గొన్నా వారికి ప్రశంస పత్రాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


