ప్రతీ పంచాయతీకి 20 ఇందిరమ్మ ఇళ్లు
● ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు
దహెగాం: నియోజకవర్గంలోని ప్రతీ గ్రామ పంచాయతీకి ఇరవై ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతువేదికలో కొత్తగా మంజూరైన 28 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 45 రోజుల్లో పనులు ప్రారంభించకుంటే రద్దు చేసి ఇతరులకు ఇవ్వనున్నట్లు తెలిపారు. మండలానికి 274 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద దిగిడ గ్రామాన్ని ఎంపిక చేసి 24 ఇళ్లు మంజూరు చేయగా అందులో 17 పూర్తి దశకు చేరాయన్నా రు. అనంతరం నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నస్రుల్లాఖాన్, సర్పంచులు రాపర్తి జయలక్ష్మి, ఇస్లావత్ గోపాల్, దందెర శంకర్, శేగం భారతి, కొద్దెన మల్లక్క, ఎంపీవో శ్రీనివాస్, హౌసింగ్ ఏఈ సందీప్, బీజేపీ మండల అధ్యక్షుడు లగ్గామ దామోదర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి ధనుంజయ్, తదితరులు పాల్గొన్నారు.


