‘జీవో 252 సవరించాలి’
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ఉన్న జీవో 252 తక్షణమే సవరించాలని జర్నలిస్టు యూనియన్ (టీయూడబ్ల్యూజే–హెచ్–143) జిల్లా కన్వీనర్ రవి నాయక్ డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రిడిటేషన్ కార్డుల్లో కోత విధించడం తగదని, గతంలో అమలులో ఉన్న విధానాన్ని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో సంతోష్‌కుమార్, గిరీష్, సతీష్, ఇర్పాన్, రాజు, కిరణ్, రామస్వామి, మోహన్, వెంకటేష్, పాషా, ఖలీల్, తదితరులు పాల్గొన్నారు.


