అంతర్జాతీయ సదస్సుకు చైతన్యకుమారి
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాలలోని రాంనగర్‌కు చెందిన డాక్టర్ కే.చైతన్యకుమారి ఈ నెల 27, 28న ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జరిగే 62వ అంతర్జాతీయ సదస్సుకు ఎంపికయ్యారు. కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో ఆల్ ఇండియా పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సదస్సులో ‘భారతదేశంలో ప్రభుత్వ విధానాల రూపకల్పన–ఒక అధ్యయనం’ అనే అంశంపై ప్రసంగిస్తారు. గతంలో పలు జాతీయ స్థాయి సదస్సుల్లో ప్రసంగించిన ఆమె ఇటీవల ‘పబ్లిసిటీ పాలసీ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ ఏ స్టడీ ఆఫ్ ఐటీడీఏ ప్రోగ్రామ్స్ ఇన్ కుమురంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్’ అనే అంశపై విస్తృతస్థాయిలో పరిశోధన చేసి వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రాలను భవనేశ్వర్ అంతర్జాతీయ సదస్సులో సమర్పించనున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేస్తున్న చైతన్యకుమారి అంతర్జాతీయ సదస్సుకు ఎంపిక కావడంపై భర్త చంద్రయ్య, స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినందించారు.


