కేంద్ర ఉద్యోగాలపై అవగాహన అవసరం
కాగజ్‌నగర్‌టౌన్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలపై విద్యార్థులకు అవగాహన అవసరమని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.ప్రవీణ్ కుమార్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉద్యోగాలపై అవగాహన కల్పించారు. ఆయన మా ట్లాడుతూ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పై అవగాహన పెంచుకుని ప్రణాళిక ప్రకారం చది వితే కొలువులు సాధించవచ్చన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏ ర్పాట్లు చేసినట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జనరల్ డ్యూటీ, కానిస్టేబుల్ ఉద్యోగాల నో టిఫికేషన్‌లో ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్, వివిధ అంశాల గురించి వివరించారు. కార్యక్రమంలో కళా శాల వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీనరసింహం, శాదర, అ ధ్యాపకులు రాజేశ్వర్, దేవేందర్, లక్ష్మయ్య, నర్సింగరావు, మహేశ్, శాంభవి, విద్యార్థులు పాల్గొన్నారు.


