వేతనాల కోసం బల్దియా కార్మికుల సమ్మె
కాగజ్‌నగర్‌టౌన్: వేతనాల కోసం కాగజ్‌నగర్ బల్దియా పారిశుద్ధ్య కార్మికులు సోమవారం విధులు బహిష్కరించి సోమవారం కార్యాలయం ఎదుట సమ్మె చేపట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ నాలుగు నెలలుగా పెండింగులో ఉన్న వేతనాలను చెల్లించాలని, బకాయిలో ఉన్న పీఎఫ్, ఈఎస్‌ఐ రూ.1.50 కోట్లు చెల్లించకపోవడంతో సమ్మెకు దిగినట్లు తెలిపారు. ఏటా ఇదే తంతు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి శంకర్, మున్సిపల్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజీవ్, మల్లేశ్, రమేశ్, లక్ష్మి, ఈశ్వరమ్మ, దుర్గమ్మ, శోభ, ప్రియదర్శిని, తిరుపతి, బాపు లక్ష్మణ్, మహేందర్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.


